పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ పై వేల కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. ఒక్కో సినిమా మినిమమ్ 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అప్ కమింగ్ మూవీ 'సలార్' కూడా రెండు భాగాలు కావడంతో.. బడ్జెట్ డబుల్ అయినట్టు తెలుస్తోంది. అయినా కూడా సలార్ విసయంలో రిస్క్ అని భావిస్తున్నారట బయ్యర్లు.
సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మార్క్‌లో భారీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతోంది సలార్ మూవీ(Salaar Movie). శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా నటిస్తున్నారు. అయితే.. తాజాగా రికార్డులు క్రియేట్ చేసిన సలార్ టీజర్లో.. రెండు భాగాలుగా ప్రకటించారు మేకర్స్. సలార్ పార్ట్ 1.. సీజ్ ఫైర్, పేరుతో ఫస్ట్ పార్ట్ రాబోతోంది. ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. టీజర్‌తో అది రెట్టింపు అయింది. అందుకే సలార్‌కు భారీగా డిమాండ్ చేస్తున్నారట హోంబలే ఫిలింస్ వారు.
మొత్తంగా.. కేవలం థియేట్రికల్ హక్కులతోనే 600 కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారట. అందులో తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం దాదాపు 200 కోట్లు కోట్ చేస్తున్నారట. నైజాం ఏరియాకు 80 కోట్లు, ఆంధ్రా, రాయలసీమ కలిపి 120 కోట్లు కోట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫిగర్ చూసిన తర్వాత బయ్యర్స్ కాస్త భయపడుతన్నారట. ‘సలార్'(Salaar Movie)కు ఎంత క్రేజ్ ఉన్నా.. 200 కోట్లంటే మామూలు విషయం కాదు. మన తెలుగులో ఓ స్టార్ హీరో క్లోజింగ్ కలెక్షన్స్ అవి.
అలాంటిది.. సలార్(Salaar Movie) ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు జరిగితే.. గ్రాస్ దానికి డబుల్ రాబట్టాల్సి ఉంది. పైగా బాహుబలి తర్వాత ప్రభాస్ ట్రాక్ రికార్డ్ బాగాలేదు. రీసెంట్గా వచ్చిన ‘ఆదిపురుష్’ తెలుగు రైట్స్ 150 కోట్లకు తీసుకోగా.. లాభాలు రాలేదని అంటున్నారు. అందుకే.. సలార్‌ను భారీ రేటుకు తీసుకుంటే.. రిస్క్ అని భావిస్తున్నారట బయ్యర్లు. మరి ఫైనల్‌గా సలార్ తెలుగు రైట్స్ ఎంతకు అమ్ముడు పోతాయో చూడాలి.