బాహుబలి2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ప్రతి సినిమా.. డే వన్ వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సలార్ కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు. అది కూడా హిట్ టాక్ పడడంతో మామూలుగా ఉండదని లెక్కలు వేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ బాక్సాఫీస్‌ని చెల్లాచెదురు చేసేలా ఉంది. రిలీజ్‌కి ముందున్న హైప్‌కి పాజిటివ్ టాక్ కూడా తోడైంది కాబట్టి.. సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్‌ని రాబట్టడం గ్యారెంటీ. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు వచ్చిన టాక్‌కు, ఫస్ట్ డే కలెక్షన్స్‌కు సంబంధమే లేకుండా ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో.. బాహుబలి2 కలుపుకొని వరుసగా నాలుగు సార్లు వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఏకైక హీరోగా నిలిచాడు ప్రభాస్. ఇక ఇప్పుడు సలార్‌తో మరోసారి వంద కోట్ల ఓపెనింగ్ అందుకొని రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు డార్లింగ్.
సలార్ సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ పడినా.. ఫస్ట్ వీకెండ్ వరకు రోజుకు వంద కోట్లు ఈజీగా లేస్తాయ్ అని అంచనా వేశారు. అన్నట్టే ఇప్పుడు భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. వరల్డ్ వైడ్‌గా 800 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది డైనోసర్. అయితే.. సలార్‌కు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ నుంచి గట్టి పోటీ ఏర్పడింది. డంకీ ఓ రోజు ముందే థియేటర్లోకి వచ్చింది కాబట్టి.. సలార్ థియేటర్లు షేర్ చేసుకోవాల్సి వచ్చింది.
అయినా కూడా సలార్ డే వన్ ఓపెనింగ్స్ వరల్డ్ వైడ్‌గా 170 నుంచి 180 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందంటున్నారు. 99% ఆక్యుపెన్సీ రేట్ మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా 150 కోట్లని కలెక్ట్ చేయడం పెద్ద కష్టంగా కనిపించట్లేదు. హిట్ టాక్ పడింది కాబట్టి సలార్ డే 1 రికార్డ్ క్రియేట్ చేసేలానే ఉంది. ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ చూస్తే.. డంకీ కంటే సలార్‌దే పై చేయిగా ఉంది. కాబట్టి.. సలార్ ఓపెనింగ్స్ దుమ్ముదులిపేయడం పక్కా.