ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(Sai dharam) కలిసి నటిస్తున్న మూవీ బ్రో. ఈ చిత్రం నుంచి త్వరలోనే టీజర్ రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ కొత్తగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సాయి ధరమ్ తేజ్(Sai dharam). ఆయన పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వరస హిట్లతో ముందుకు దూసుకుపోయాడు. మధ్యలో కాస్త తడపడినా, మళ్లీ లైన్ లోకి వచ్చేశాడు. ఇటీవల విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆయన కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. వంద కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు రాబట్టింది. చాలా కాలం తర్వాత ఆయనకు దొరికిన హిట్ ఇది.
కాగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా(social media)లో సైతం చాలా చురుకుగా ఉంటారు. అప్పుడప్పుడు తన ఫోటోలను, అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన స్టైలిష్ లుక్ లుక్ మెరిసిపోయాడు. బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించి, కళ్లకు నళ్ల కళ్లద్దాలు పెట్టుకొని కనిపించారు. మేనమామ పోలికులతో ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తన చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ దేవుడుగా, సాయి ధరమ్ తేజ్ భక్తుడిగా కనపించనున్నాడు. వినోదయ సీతం సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.