దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద.. దాదాపుగా 1200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో బాహుబలి2 తర్వాత మరోసారి వెయ్యి కోట్ల దర్శకుడిగా రాజమౌళి పేరు మార్మోగిపోయింది. ఇక థియేటర్‌ను షేక్ చేసిన ఆర్ఆర్ఆర్.. ఓటిటిలో అంతకు మించి అనేలా హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ సమయంలో చరణ్, తారక్‌లతో కలిసి దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసిన జక్కన్న.. ఇప్పుడు మరోసారి ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అక్టోబర్ 21న జపాన్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జపాన్‌లో భారీగా ప్రమోషన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు రాజమౌళి. ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. RRR ప్రమోషన్ కోసం వచ్చె నెలలో జపాన్ వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు జక్కన్న. అలాగే చరణ్, తారక్ కూడా జపాన్ వెళ్లనున్నారని టాక్. ఇప్పటికే అక్కడ ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు. గతంలో బాహుబలి మూవీకి ఆ దేశంలో భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో రాజమౌళికి అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే ఇప్పుడు జపనీయుల కోసం ‘ఆర్ఆర్ఆర్’ను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. మరి హాలీవుడ్‌ను షేక్ చేసిన ఆర్ఆర్ఆర్.. జపాన్‌లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.