Ram Charan ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ వైడ్‌గా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హాలీవుడ్లో అయితే చరణ్ పేరు మార్మోగిపోయింది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ రేసులో ఉండడంతో.. చరణ్, తారక్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయారనే చెప్పాలి. మార్చి 12 ఆర్ఆర్ఆర్ ఆస్కార్ భవితవ్యం తేలిపోనుంది. ఒకవేళ ఆస్కార్ కొట్టేస్తే మాత్రం.. చరణ్, ఎన్టీఆర్ అప్ కమింగ్ ఫిల్మ్స్ పై భారీ హైప్ క్రియేట్ అవనుంది. ప్రస్తుతం చరణ్ ఆర్సీ15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం సాంగ్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ విషయంలో చాలాకాలంగా ఊరిస్తు వస్తున్నారు మేకర్స్. అయితే ఎట్టకేలకు దిల్ రాజు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ టైం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా ఆర్సీ 15 ఫస్ట్ లుక్ రానుందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే చరణ్ బర్త్ డేను గ్రాండ్ సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. దాంతో ఆ రోజు కోసం వెయిటింగ్ అంటున్నారు. ఇకపోతే.. ఆర్సీ 16ని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయబోతున్నట్టు.. ఇప్పటికే ప్రకటించాడు రామ్ చరణ్. ఆర్సీ 15 అయిపోగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవనుంది. ఆ తర్వాత కన్నడ డైరెక్టర్ నర్తన్‌తో చరణ్ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. బర్త్ డే రోజే దీని పై క్లారిటీ రానుందని అంటున్నారు.