»Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie Making Video Release
Ravi Teja: అదిరిపోయిన టైగర్ నాగేశ్వరరావు మేకింగ్ వీడియో
మాస్ మహారాజ్ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రైలర్‌తో ఆకట్టుకోవడమే కాకుండా వినూత్నంగా ప్రమోషన్లు చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
Ravi Teja starrer Tiger Nageswara Rao movie making video release
Ravi Teja: హీరో రవితేజ్, దర్శకుడు వంశీ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(tiger nageswara rao). దర్శకుడు ఓ సందర్భంలో మాట్లాడుతూ హీరోకు గాయాలు అయ్యాయి అన్నారు. ఓ సీన్లో భాగంగా హీరో రవితేజ ప్రమాదకరమైన స్టంట్ విఫలమైందన్నారు. తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది ఈ సినిమా కోసం రవితేజ ఎంత కష్టపడ్డాడో. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటేనే ఎంతో ఆసక్తిగా ఉంది. సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది.
‘టైగర్ నాగేశ్వరరావు’ 1970ల నేపథ్యంలో హృదయాన్ని కదిలించే థ్రిల్లర్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో రవితేజ ప్రధాన పాత్రలో యాక్ట్ చేయగా..ఇందులో అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, జిషు సేన్‌గుప్తా, గాయత్రీ భరద్వాజ్, మురళీ శర్మ, తదితరులు ఉన్నారు. ఈ మూవీ అక్టోబర్ 20న థియేటర్స్ లలో విడుదల కానుంది.