దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా.. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసిన సంగతి తెలిసిందే. ఒక్క ఇండియన్ బాక్సాఫీస్‌ను మాత్రమే కాదు ఓటిటిలోకి రిలీజ్ వరల్డ్ వైడ్‌గా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ గురించి చర్చ జరుగుతునే ఉంది. ఇక బియాండ్ ఫిలిం ఫెస్ట్‌తో భాగాంగా.. లాస్ ఏంజెల్స్‌లో బిగ్గెస్ట్ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో దాదాపు 900 మందికి పైగా విదేశీ, స్వదేశీ ఆడియెన్స్‌తో కలిసి ఎంజాయ్ చేశారు రాజమౌళి. ఇక ఈ స్పెషల్ షోలో జక్కన్న పై ప్రశంసల వర్షం కురిసింది. ఈ సందర్భంగా.. మహేష్ బాబుతో ‘గ్లోబ్ ట్రాటింగ్’ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు మరోసారి చెప్పుకొచ్చాడు. అయితే షో అయిపోగానే జక్కన్న స్టైజ్ పైకి వెళ్తుంటే.. లాంగ్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఆడియెన్స్.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో దీనిపై తన ఎగ్జైట్మెంట్ని ట్విట్లర్లో షేర్ చేస్తు.. అమెరికా ప్రేక్షకులకు థ్యాంక్యూ చెప్పారు. ఇక ఈ క్రేజ్ చూసి.. ఆ వీడియోని రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ‘అండ్ ఓన్లీ రాజమౌళి’ అంటూ పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఏదేమైనా ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్తో పాటు.. మరోసారి దర్శకధీరుడు పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోందని చెప్పొచ్చు.