Ram Charan Hollywood Project : అవును.. నిజమే.. మెగా అనౌన్స్మెంట్ వచ్చేస్తోంది!
Ram Charan : ప్రపంచం మొత్తం ఇప్పుడు మారుమోగిపోతున్న పేర్లు మూడే మూడు. రాజమౌళి, తారక్, రామ్ చరణ్.. నిన్న మొన్నటి వరకు రాజమౌళి పేరు బాగా వినిపించగా.. ఇప్పుడు చరణ్, తారక్ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ ఏదో ఓ విషయంలో హైలెట్ అవుతునే ఉన్నాడు.
ప్రపంచం మొత్తం ఇప్పుడు మారుమోగిపోతున్న పేర్లు మూడే మూడు. రాజమౌళి, తారక్, రామ్ చరణ్.. నిన్న మొన్నటి వరకు రాజమౌళి పేరు బాగా వినిపించగా.. ఇప్పుడు చరణ్, తారక్ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ ఏదో ఓ విషయంలో హైలెట్ అవుతునే ఉన్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన చరణ్.. తన హాలీవుడ్ డెబ్యూ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో పాన్ ఇండియా కాదు.. ఏకంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపుకు తెచ్చుకున్నారు చరణ్, ఎన్టీఆర్. చాలా రోజులుగా ఈ ఇద్దరు హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతునే ఉంది. ఇప్పటికే కొన్ని హాలీవుడ్ సంస్థలు, ఓటిటి సంస్థలు వీళ్లను సంప్రదించాయనే టాక్ ఉంది. అయితే ఇప్పటి వరకు మన హీరోలు దీనిపై స్పందించలేదు. కానీ చరణ్ మాత్రం.. హాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు. ‘అవును.. నిజమే, ప్రస్తుతం కొన్ని హాలీవుడ్ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. రెండు, మూడు నెలల్లోనే హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతానని.. ఒక్క హాలీవుడ్ లో మాత్రమే కాదు, ఏ దేశం సినిమాలోనైనా నటించడానికి సిద్ధం.. అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఈ లెక్కన చరణ్‌కు భారీ హాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టే కనిపిస్తోంది. అదే జరిగితే.. చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే. ప్రస్తుతం ఈ న్యూస్ మెగాఫ్యాన్స్‌ను గాల్లో తేలేలా చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా.. ఇప్పటి నుంచే హాలీవుడ్ లెక్కలు వేసుకుంటూ.. ఊహల్లో విహరిస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆ రోజు ఆర్సీ 15(RC15) టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రాబోతోంది. అలాగే క్రేజీ అప్డేట్స్ ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఈసారి మెగా పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను నెక్స్ట్ లెవల్లో జరిపేందుకు రెడీ అవుతున్నారు. ఏదేమైనా.. చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తే.. మామూలుగా ఉండదని చెప్పొచ్చు.