రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమం ఈ రోజు నిర్వహించుకుంది. చిత్ర ప్రముఖుల మధ్య అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.
RC16: మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్(Ramcharan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా(Buchibabu sana) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ముహుర్తం ఈ రోజు ప్రారంభించారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటిస్తుంది. స్పోర్ట్ డ్రామా విలేజ్ బ్యాగ్డ్రాప్లో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, డైరెక్టర్ శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
బుచ్చిబాబు చెప్పిన కథ తనకెంతో నచ్చిందని రామ్ చరణ్ చెప్పారు. ఇది కచ్చితంగా తన అభిమానులను అలరిస్తుందని తెలిపారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఏఆర్ రెహ్మాన్ మాట్లాడారు. చాలా రోజుల తరువాత తెలుగులో సినిమా చేస్తున్నానని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ది సినిమా బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్సీ16గా వ్యవహరిస్తున్న దీనికి పెద్ది అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.