Allu Arjun: వర్షం ఎఫెక్ట్.. సుకుమార్ ప్లాన్స్ అన్నీ తారుమారు..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ని ఈ సినిమాలో చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లోకి పుష్ప క్రేజ్ పాకింది. సినిమా తారల నుంచి, క్రికెటర్స్ వరకు ఈ సినిమాలో అల్లుర్జున్ మేనరిజమ్స్ కి ఫిదా అయిపోయారు. ఈ సినిమా 2021లో విడుదలవ్వగా, రష్మిక కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప ది రూల్ చిత్రీకరిస్తున్నారు. శరవేగంగా సెకండ్ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. 2024లో మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ పుష్ప2 షూటింగ్ కి బ్రేక్స్ పడ్డాయి. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరగాల్సి ఉండగా, ఎడ తెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పాన్-ఇండియన్ మూవీలో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ వంటి నటులు నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్ వేరే సినిమాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఓ బాలీవుడ్ మూవీకి సైన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.