సంతోష్ శోభన్ హీరోగా, మాళవికా నాయర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా అన్నీ మంచు శకనుములే. ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాకి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, స్వప్న సినిమా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, రాఘవేంద్రరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు(Raghavendra rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘అశ్వినీ దత్ కు, అరవింద్ కు నాలాంటి డైరెక్టర్ల అవసరం లేదు. ఎందుకంటే దత్.. అల్లున్ని ఇంట్లో కట్టేసి పెట్టుకున్నాడు. అరవింద్ ఏమో హీరోను ఇంట్లో కట్టేసి పెట్టుకున్నాడు. వీళ్లిద్దరికి నాతో పని తీరిపోయింది. అయినా మేము ఎప్పటికీ స్నేహితులమే’ అని రాఘవేంద్ర రావు సర్ప్రైజింగ్ కామెంట్స్ చేశారు.
ఇక.. ఈ నిర్మాణ సంస్థ నుంచే సీతారామం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి కూడా రాఘవేందర్ రావు(Raghavendra rao) స్పందించారు. సీతారామం సినిమాలో సీత ఒంటరిగా మిగిలిపోవడం తలుచుకుంటే తనకి ఇప్పటికి కన్నీళ్లు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు. రామ్ చనిపోకుండా ఎక్కడో ఉన్నాడని, అది సీతకి తెలిసేలా సీతారామం 2 ప్లాన్ చేయమని సలహా ఇచ్చాడు. మరి దర్శకేంద్రుడు అడిగిన తరువాత చిత్ర యూనిట్ ఏమన్నా ఆలోచన చేస్తుందా? సీక్వెల్ ని ప్లాన్ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.