కరోనా సమయంలో అఖండ తర్వాత.. 2021 ఇయర్ ఎండింగ్లో వచ్చిన ఐకాన్ స్టార్.. పుష్ప మూవీతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతోనే స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. ఇండియాలో దాదాపు 450 కోట్ల గ్రాస్‌ని రాబట్టిన పుష్ప ది రైజ్.. ఇప్పటికీ రికార్డు క్రియేట్ చేస్తునే ఉంది. ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత.. ఇటివలే రష్యాలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేకర్స్ నుంచి మరో అప్డేట్ రాలేదు. కానీ తాజాగా రష్యాలోను పుష్ప రికార్డ్ క్రియేట్ చేసినట్టు చెబుతున్నారు. రష్యా 25 రోజులు కలెక్షన్స్ వచ్చేసి..10 మిలియన్ రూబిళ్లు వసూలు చేసిందట. ఇప్పటికీ ఆ దేశంలోని 774కి పైగా స్క్రీన్లలో ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతోందని.. చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే అమెరికన్ డాలర్స్ ప్రకారం రష్యాలో 137K రాబట్టింది పుష్ప. ఇది ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమా కన్నా ఎక్కువ కావడం విశేషం. దాంతో రష్యాలో బాహుబలి2 రికార్డులు బద్దలు కొట్టింది పుష్ప. అయినా కూడా రష్యాలో ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ పెట్టిన ఖర్చుని కూడా.. పుష్ప రాబట్టలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ పుష్పరాజ్ మాత్రం మెల్లగా తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ఇది ఖచ్చితంగా పుష్ప2కు కలిసొచ్చే అంశమే. ఇప్పటికే పుష్ప2ని అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. గత నెలలో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాను.. సంక్రాంతి తర్వాత రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. మరి పుష్ప2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.