మామూలుగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో హల్ చల్ చేస్తుంటారు. ఇక రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. కొంచెం స్టైలిష్‌గా బైక్ రైడ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం పవన్ బైక్ రైడ్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. పవన్ కళ్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో పాన్ ఇండియన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ.ఎం. రత్నం నిర్మాతగా మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా షూటింగ్ స్పాట్లో బైక్ రైడ్ చేశారు పవన్. షూటింగ్ గ్యాప్‌లో బైక్ పై వెళ్తున్న విజువల్స్.. నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మామూలుగానే పవన్‌కు బైక్స్ అంటే చాలా ఇష్టం. దాంతో పవన్ లేటెస్ట్ స్టైలిష్ లుక్కు ఫిదా అవుతున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో.. ఆ బైక్ కాస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన ఆ బైక్ ధర దాదాపు 20 లక్షలకు పైగా ఉంటుందని అంటున్నారు. ఇకపోతే.. ‘హరి హర వీరమల్లు’ లేటెస్ట్ షెడ్యూల్లో 900 మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో.. దీనిపై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా పవన్ బైక్ రైడింగ్ అదిరిపోయిందటున్నారు.