• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

ఎన్టీఆర్ 30 మరింత వెనక్కి..!

ఎన్టీఆర్ 30 అనుకున్నట్టే జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇంకొంచెం వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో ఫిబ్రవరిలో ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. దాంతో ఫిబ్రవరి ఎండింగ్‌లో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపించింది. అయితే ఇప్పుడు మార్చికి షిప్ట్ అయినట్టు తెలుస్తోంది. మార్చి 20 నుంచి రెగ్యూలర్ షూటింగ్‌ మొదలు కాబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. మార్చి 12న ఆస్కార్ అవా...

February 4, 2023 / 09:30 PM IST

పవన్‌ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ ట్వీట్‌ వైరల్‌

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఈ నిర్మాత ఏదోక విషయంలో వార్తల్లో హైలెట్ అవుతూనే ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించేవారిలో బండ్ల గణేష్ ముందుంటాడు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లూ చేస్తూ ఉన్నాడు. ఆయన చేసే ట్వీట్స్‌లో కొన్ని వివాదాస్పదం అవుతుంటాయి. పవర్ స్టార్‌తో తీన్‌మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలను బండ్ల గణేష్ తెరకె...

February 4, 2023 / 09:10 PM IST

నిజమేనా.. ‘సలార్’ టీజర్ డేట్ ఫిక్స్ అయిందా..!?

సలార్ టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే సలార్ టీజర్ వస్తోంది.. అనేమాట విన్నప్పుడల్లా డార్లింగ్ ఫ్యాన్స్‌ చెవులు కోసుకుంటున్నారు. కానీ తమ హీరోకి ప్రశాంత్ నీల్ ఇవ్వబోయే ఎలివేషన్‌ను ఊహించుకుంటునే కాలం వెల్లదిస్తున్నారు. సలార్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయినా ఇప్పటి వరకు స్టిల్స్ తప్పితే చిన్న గ్లింప్స్ కూడా...

February 4, 2023 / 08:49 PM IST

త్వరలోనే ‘క్రిష్ 4’..! అప్డేట్ ఇచ్చిన హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్

హృతిక్ రోషన్ క్రిష్ సినిమాను అంత ఈజీగా మరిచిపోవడం కష్టం. అప్పట్లో ఇండయన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదేపింది ఈ సూపర్ హీరో సినిమా. ఇప్పటికే మూడు ఫ్రాంఛైజీలు వచ్చాయి. దాంతో క్రిష్ 4 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత 2022లో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమన్నారు. కానీ ఇప్పటి వరకు మరో అప్డేట్ లేదు. అయితే […]

February 4, 2023 / 08:45 PM IST

‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. గెస్ట్‌గా ఎన్టీఆర్!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అమిగోస్’.. ఈ నెల 10న రిలీజ్‌ కాబోతోంది. రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్‌ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక వాటిని నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లేందుకు య...

February 4, 2023 / 08:35 PM IST

‘అమిగోస్’ హిట్ సెంటిమెంట్..!

బింబిసారతో సాలిడ్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మరో హిట్ కూడా కళ్యాణ్ ఖాతాలో పడేలానే ఉంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన అమిగోస్ ట్రైలర్.. ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి నెగెటివ్ రోల్. అంతకు ముందు బింబిసారలోను నెగెటివ్ టచ్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు అమిగోస్‌లోను ఇదే రిపీట్ కాబోత...

February 4, 2023 / 08:31 PM IST

సిద్ధార్థ్, అదితి రావు పెళ్లి ఫిక్స్? ఇద్దరికీ రెండో పెళ్లే.. వేదిక ఎక్కడ?

టాలీవుడ్‌లో వచ్చిన మహాసముద్రం సినిమా మీకు గుర్తుందా? ఆ సినిమాలో నటించిన సిద్ధార్థ్, అదితి రావు ప్రేమలో పడ్డారని ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా కోడై కూస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అను ఇమ్మన్యుయేల్‌తో పాటు మరో హీరోయిన్‌గా అదితి రావు కూడా నటించింది. టాలీవుడ్‌లో అదితి రావు సమ్మోహనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోనూ నటించింది. తన...

February 4, 2023 / 08:28 PM IST

క్వీన్ ఈజ్ బ్యాక్.. కండలు పెంచుతున్న సమంత..!

సమంత మయోసైటిస్ బారిన పడడంతో.. ఆమె అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు. కానీ అమ్మడు జెట్ స్పీడ్‌లో కోలుకుంది. అదే స్పీడ్‌లో షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది. అయితే ముందుగా విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్‌లో అడుగుపెడుతుందని అనుకున్నారు. కానీ అమ్మడు మాత్రం విజయ్‌కి హ్యాండ్ ఇచ్చి బాలీవుడ్‌కు చెక్కేసింది. ఈ సందర్భంగా రౌడీ ఫ్యాన్స్‌కు సారీ కూడా చెప్పింది. త్వరలోనే ఖుషి షూటింగ్‌లో జా...

February 4, 2023 / 08:19 PM IST

మెమరీ లాస్‌తో బాధపడుతున్న భానుప్రియ

అలనాటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన భానుప్రియ మెమరీ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అప్పట్లో చిరంజీవితో సమానంగా డ్యాన్స్ చేయగలిగిన అతి తక్కువ మంది హీరోయిన్లలో భానుప్రియ కూడా ఒకరు. గత కొంతకాలంగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ మధ్య ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఈ విషయం గురించే భానుప్రియ పలు కీలక విషయాలు వెల్లడ...

February 4, 2023 / 08:18 PM IST

వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ అదుర్స్, పవన్ కు నా మద్దతు: బాబీ

గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా...

February 4, 2023 / 07:59 PM IST

పోస్ట్‌మార్టం పూర్తి.. ఇంటికి వాణీ జయరాం భౌతికకాయం తరలింపు

ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తడంతో ఆమెను పరీక్షించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ముఖంపై పలు గాయాలు ఉన్నాయి. దీంతో ఆసుపత్రిలో వాణీకి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని చెన్నైలోని తన ఇంటికి తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్...

February 4, 2023 / 07:25 PM IST

వాణీ జయరామ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వాణీ జయరామ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి భారతీయ సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ అన్నారు. 14 భాషల్లో 1000 కి పైగా సినిమాల్లో ఆమె 20 వేలకు పైగా పాటలు పాడారని, ఆమె సినీ రంగానికి ఎంతో సేవ చేశారని ఈసందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వాణీ జయరామ్ […]

February 4, 2023 / 06:27 PM IST

చీటింగ్ కేసులో సినీ హీరో అరెస్ట్‌

సినీ ఇండస్ట్రీలో హీరోగా చెలామణి అవుతూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఒకరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసిన నవీన్ రెడ్డి మోసాలకు పాల్పడ్డాడు. కంపెనీలోని సహ డైరెక్టర్లకు తెలీయకుండా కంపెనీ ఆస్తులను తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రూ.55 కోట్లు మోసం...

February 4, 2023 / 05:29 PM IST

అఖిల్ ఏజెంట్(AGENT) మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎట్టకేలకు యంగ్ హీరో అక్కినేని అఖిల్(Akhil Akkineni)ఏజెంట్(AGENT)మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది. ఇక వీడియో అయితే మాములుగా లేదు. అఖిల్ ను అండర్ వేర్ పై ఓ కూర్చిలో తాళ్లతో కట్టేసి ఉంచడం చూడవచ్చు. మరోవైపు హీరోను టెల్ మీ దా నేమ్ పోలీసా అంటూ మరో వ్యక్తి ప్రశ్నిస్తాడు. రా ఏజన్సీ అంటూ ...

February 4, 2023 / 05:33 PM IST

సింగర్ వాణీ జయరాం మరణంపై అనుమానాలు

ప్రముఖ సింగర్ వాణీ జయరాం శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలు ఉన్నట్లు పని మనిషి చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాణీ జయరాం ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. ఇంటి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పని మనిషి ఇంటికొచ్చాక ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుప...

February 4, 2023 / 04:10 PM IST