క్రేజీ హీరోయిన్ శ్రీలీల గురించి తెలియనివారు ఉండరు. ప్రస్తుతం ఏ మూవీలో చూసినా శ్రీలీలే కనపడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరికీ లేని క్రేజ్ ఈ తెలుగు అమ్మాయి సొంతం చేసుకుంది. అందుకే ఆఫర్లు అన్నీ ఈ బ్యూటీ చుట్టే తిరుగుతున్నాయి. స్టార్ హీరో దగ్గర నుంచి కుర్ర హీరో వరకు అందరూ శ్రీలీలే తమకు హీరోయిన్ గా రావాలని కోరుకుంటున్నారు.
ఈ మధ్య కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ కోవకు చెందిన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'దిల్ సే' విడుదల కానుంది. ఆగస్టు 4వ తేదిన ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
టాలీవుడ్ సంచలనం సంయుక్తా మీనన్. ఈ గోల్డెన్ బ్యూటీ వరస ఛాన్స్ లతో దూసుకుపోతోంది. ఆమె నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో, ఆమె గోల్డెన్ గర్ల్ గా మారిపోయింది. సంయుక్త సినిమాలో ఉంటే చాలు సినిమా హిట్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఏర్పడింది.
టాలెంటెడ్ యంగ్ హీరీల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. వరస సినిమాలతో ఈ హీరో దూసుకుపోతున్నాడు. ఇటీవల దాస్ కా దమ్కీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు. ముఖ్యంగా నెగిటివ్ రోల్ లో ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ కొందరిని బాగా ఆకట్టుకోగా, కొందరు ఈ మూవీపై విమర్శలు కురిపించారు. అయితే, ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ప్రభాస్ ని ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
తానొక మూవీ క్రిటిక్ అంటూ చెప్పుకుంటూ తిరిగే ఉమైర్ సంధు పేరు వినే ఉంటారు. ఇండియాలో ఏదైనా మూవీ విడుదల కాకముందే, మూవీ ఇలా ఉంది, అలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అయితే చాలా వరకు ఆయన సినిమా అద్భుతం అని చెప్పగానే, ఆ మూవీ ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆయన సినిమా బాలేదు అని రివ్యూ ఇచ్చినవి బ్లాక్ బస్టర్ అయినవీ కూడా ఉన్నాయి. ఆయన చెప్పిన రివ్యూ నిజమైన సందర్భాలు చాలా తక్కువ.
బిగ్‌బాస్ షో సెన్సార్ విషయంలో ఏపీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రసారం అయ్యాక పిటిషన్లను పరిశీలించడం అంటే పోస్ట్‌మార్టం చేసినట్లే అని ఘాటుగా స్పందించింది. ఈ విషయంపై కేంద్రానికి తగిన సూచలను ఇవ్వాలని పేర్కొంది.
ఓ అందమైన పల్లెటూరులో కృష్ణ అనే చలాకీ కుర్రాడు జీవిత కథాంశంతో వస్తోన్న సినిమా కృష్ణగాడు అంటే ఒక రేంజ్. కుర్రాడి జీవితంలో ఓ అమ్మాయి వస్తే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఓ వైపు తన తండ్రి కోరికను నెరవేర్చడం, మరో వైపు ప్రేమను గెలవడం..ఇలాంటి సవాళ్ల మధ్య కృష్ణ పోరాట తీరును సినిమాలో చూపించారు.
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ విడుదలకు దగ్గరపడుతోంది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నారు.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లాగే ఇప్పుడు తమన్నా కూడా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. అయితే శృతి హాసన్ సక్సెస్ అయినప్పటికీ.. తమన్నా పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి తమన్నాను కాపాడే హీరో ఎవరు?