సెలబ్రిటీల జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయని అనేక మంది అనుకుంటారు. కానీ కష్టాలు, అనారోగ్యం సహా అనేక విషయాల్లో అందరూ ఒక్కటేనని పలు సందర్భాలలో అనిపిస్తుంది. అవును. ఇటివల బాలీవుడ్ నటి బిపాసా బసు నటి నేహా ధూపియాతో జరిగిన వీడియో సంభాషణలో సంచలన విషయాలను వెల్లడించారు. తన కుమార్తె పుట్టినప్పుడు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలిపి కన్నీరు పెట్టుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తమిళ చిత్రం వేదాళానికి భోళా శంకర్ పేరుతో రీమేక్‌గా వస్తుంది. అయితే ఈ చిత్రంలో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అన్నత్తేలో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలో కూడా కీర్తి సురేష్ సోదరిగా నటించింది. ఈ సందర్భంగా ఈ అమ్మడు విశేషాలను తెలుసుకుందాం.
మోడల్, బాలీవుడ్ హాట్ బ్యూటీ, నటి షెర్లిన్ చోప్రా(sherlyn chopra) తన హాట్ కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. షెర్లిన్ చోప్రా ఓ మీడియా సంభాషణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi)ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలోని కోకాపేట్ ప్రాంతంలో భూముల విలువ ఒక్కసారిగా పెరిగింది. ఈ ప్రాంతంలో భూమి విలువ ఎకరా 100 కోట్ల రూపాయలు పలుకుతోంది. అయితే ఇక్కడి భూముల వేలం మెగాస్టార్ చిరంజీవికి బంగారంలా మారినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.2000 కోట్లకుపైగా ఆస్తులు సమకూరినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
స్టార్ హీరో రజినీకాంత్(rajinikanth) నటించిన నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన జైలర్(jailer) మూవీ తమిళం, తెలుగు, హిందీ వెర్షన్‌లు ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించగా యునైటెడ్ స్టేట్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి.
నటి ఇలియానా డి క్రజ్(Ileana D'Cruz) కీలక ప్రకటన చేసింది. తనకు మగబిడ్డ(baby boy) పుట్టాడని వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 'పోకిరి' నటి ఆగస్టు 1న జన్మించిన తన నవజాత కుమారుడి చిత్రాన్ని షేర్ చేసి పేరు కూడా ప్రకటించింది. అయితే తండ్రి ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ఇప్పటికే మూవీ టీమ్ లాంఛ్ రోజే ప్రకటించింది. వారు డేట్ ప్రకటించినప్పటి నుంచి, ఆ ప్రకారమే షెడ్యూల్డ్ గా మూవీ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే, ఇప్పుడు దేవర మూవీతో పుష్ప2 పోటీపడనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఏ నోట విన్నా బేబి మూవీ పేరే వినపడుతోంది. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ కి చాలా కాలం తర్వాత వచ్చిన హిట్ ఇది. అసలు ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్ ఆగస్ట్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. అతని తదుపరి చిత్రం #Mega156 ఆల్రెడీ ఒకే అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
విక్రమ్ మెగా సక్సెస్ తర్వాత కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో అనేక ప్రాజెక్టులను ప్రారంభించాడు. శింబు, శివకార్తికేయన్‌లతో భారీ బడ్జెట్ చిత్రాలను ప్రారంభించాడు. వీటిలో శివకార్తికేయన్ సినిమా షూటింగ్ దశలో ఉంది. #SK21 గురించిన తాజా అప్‌డేట్ ఏమిటంటే, ఇది నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించిన సినిమా అని తెలుస్తోంది.
నిజమే.. శర్వానంద్ పెళ్లై రెండు నెలలే అవుతోంది. కానీ అప్పుడే తండ్రి కాబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు షాకింగ్‌గా మారింది. మరి నిజంగానే ఈ యంగ్ హీరో ఫాదర్‌గా ప్రమోట్ అవుతున్నాడా? ఇండస్ట్రీ వర్గాల్లో ఎందుకు ప్రచారం జరుగుతోంది?
బుల్లితెర బ్యూటీ విష్ణు ప్రియ గురించి అందరికీ తెలిసిందే. పలు టీవి షోలతో పాటు సినిమాలు, సాంగ్స్‌లో రచ్చ చేస్తోంది ముద్దుగుమ్మ. తాజాగా విష్ణుప్రియ జెడి చక్రవర్తితో కలిసి 'దయ' అనే వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సందర్బంగా అమ్మడి ఫిజిక్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.