ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ఇప్పటికే మూవీ టీమ్ లాంఛ్ రోజే ప్రకటించింది. వారు డేట్ ప్రకటించినప్పటి నుంచి, ఆ ప్రకారమే షెడ్యూల్డ్ గా మూవీ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే, ఇప్పుడు దేవర మూవీతో పుష్ప2 పోటీపడనున్నట్లు తెలుస్తోంది.
దేవర విడుదల అయిన రెండు వారాలకే పుష్ప2 కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారట.భారీ అంచనాలున్న రెండు పెద్ద సినిమాలు కూడా దగ్గరుండి విడుదలవుతుండడంతో ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అది కుదరదని, రెండు సినిమాల విడుదలకు నాలుగు వారాల గ్యాప్ కచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నాయి. అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్‌తో దేవర భారీ స్థాయిలో రూపొందుతోంది. ఎమోషన్, యాక్షన్ దేవరలో బాగా హైలెట్ అవుతాయని అనుకుంటన్నారట. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న లీక్ వీడియోలు కూడా అదే ప్రతిబింబిస్తున్నాయి. కొరటాల శివ ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌గా మార్చడానికి అతను నరకం చూస్తున్నాడు. జాన్వీ కపూర్ దేవర సినిమాతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
పుష్ప 2 కోసం దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. తొలి భాగం దేశ వ్యాప్తంగా విపరీతమైన ప్రభావం చూపింది. రెండవ భాగం కొద్ది రోజుల క్రితం టీజర్ రిలీజ్ చేయగా, అందులో ‘పుష్ప్ ఎక్కడ ఉంది?’ అంటూ సినిమాకు చాలా హైప్ జోడించారు. అల్లు అర్జున్ మహిళా గెటప్‌లో ఉన్న ఫస్ట్‌లుక్, సుకుమార్ పర్ఫెక్షన్ కోసం చెక్కడం ఈ సినిమాని ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రంగా మార్చాయి.