కోకాపేట(Kokapet)లో భూమి(lands) అమ్మితే.. లెక్కలేనంత డబ్బు వస్తుందని తులసి సినిమాలో కోకాపేట ఆంటీ పదహారేళ్ల కిందే చెప్పగా.. ఇప్పుడు అదే నిజమైంది. హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-వేలంలో కోకాపేట భూములు హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా.. ఆల్‌టైం రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఒక్క ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా వచ్చాయి.
ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan).. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తేరీ సినిమాకి రీమేక్ గా ప్రకటించారు. తెలుగులో ఆల్రెడీ పోలీసోడుగా వచ్చేసింది. అందరూ చూసేసిన ఈ సినిమాను మళ్లీ ఆసక్తికరంగా ఎలా తీస్తారా అనే అనుమానాలు అభిమానుల్లో చాలానే ఉన్నాయి.
ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు గ్రూప్, వారి డిజిటల్ విభాగం ETV విన్ యాప్ OTT రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే పాత చిత్రాలతోపాటు ఇటివల రవిబాబు హీరోగా నటించి సినిమాలను కూడా రిలీజ్ చేశారు. దీంతోపాటు మరికొన్ని షోలను కూడా ఈ యాప్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఓటీటీ నుంచి త్వరలోనే హీరో మంచు మనోజ్(manchu manoj) ఓ షో హోస్ట్ చేయనున్నట్లు తెలిసింది.
మిస్టేక్ మూవీ టీమ్ హిట్ టీవీతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ. అభినవ్ సర్దార్ అసలు గెడ్డం ఎందుకు పెంచుకుంటారో, ఇక తన్య కాల్రా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు.
మీరు వింటున్నది నిజమే.. తనకు ఎప్పుడో పెళ్లైపోయిందని చెప్పి షాక్ ఇచ్చింది నేషనల్ క్రష్ రష్మిక. అసలు రష్మికకు పెళ్లైపోవడం ఏంటి? అతనెవరు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కానీ రష్మిక చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి?
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయారాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నెన్నో ముధర గీతాల ఆయన గళం నుంచి జాలు వారాయి. ఇప్పటికీ అతనో మ్యూజికల్ సెన్సేషన్. ఇప్పటి వరకు 1400 చిత్రాలకు పైగా పనిచేసి ఇళయరాజా చరిత్ర సృష్టించారు. అందుకే.. ఇప్పుడు ఇళయారాజా బయోపిక్‌కు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.
వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం వూల్ఫ్. ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, కన్నడ , హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్ విడుదల అయింది.
గత కొంత కాలంగా ఫ్లాపుల్లో ఉన్న సూపర్ స్టార్ రజనీ కాంత్.. ఈ సారి భాషా రేంజ్ సినిమాతో రాబోతున్నానని.. జైలర్ ట్రైలర్‌తో చెప్పకనే చెప్పేశాడు. రిలీజ్ అయిన జైలర్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొందరు మాత్రం ఈ సినిమా ఫలానా సినిమాలకు కాపీ అని అంటున్నారు.