Prabhas- Rajamouli : మరోసారి ప్రభాస్, రాజమౌళి ఫిక్స్.. అయితే అద్భుతమే!
Prabhas -Rajamouli : ప్రభాస్, రాజమౌళిది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఈ ఇద్దరు దాదాపు ఐదేళ్లు కలిసి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేశారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, ఆస్కార్ అవార్డులు వస్తున్నాయంటే.. ఈ ఇద్దరే మూల కారణం. ఛత్రపతి సినిమాతో మొదలైన ప్రభాస్, రాజమౌళి జర్నీ.. బాహుబలి సిరీస్‌తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది.
ప్రభాస్, రాజమౌళిది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఈ ఇద్దరు దాదాపు ఐదేళ్లు కలిసి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేశారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, ఆస్కార్ అవార్డులు వస్తున్నాయంటే.. ఈ ఇద్దరే మూల కారణం. ఛత్రపతి సినిమాతో మొదలైన ప్రభాస్, రాజమౌళి జర్నీ.. బాహుబలి సిరీస్‌తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేతిలో నాలుగైదు సినిమాలుండగా.. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే మహేష్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ హీరో ఎవరనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. కానీ మళ్లీ ప్రభాస్, రాజమౌళి కలిసి సినిమా చేయడం మాత్రం పక్కా అంటున్నారు. లేటెస్ట్ టాక్ ప్రకారం.. దాదాపుగా ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయిందనే అంచనాకు వచ్చేస్తున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇటీవల నిర్మాత దిల్ రాజుకు ప్రభాస్‌తో సినిమా ఎప్పుడు అంటూ.. ఓ ప్రశ్న ఎదురైంది. రాజమౌళితో చేస్తున్నాడు.. ఆ సినిమా అయ్యాక మా కాంబో ఉండబోతుందని చెప్పారు దిల్ రాజు. ఈ లెక్కన నెక్స్ట్ మహేష్ సినిమా తర్వాత ప్రభాస్‌తోనే రాజమౌళి సినిమా ఉంటుందని ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. మహేష్ ప్రాజెక్ట్ అయిపోయేలోపు ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ కానున్నాయి. కాబట్టి రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్‌తోనే అంటున్నారు. అదే జరిగితే.. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా మరో వండర్‌గా నిలిచిపోతుందని చెప్పొచ్చు. మరి ప్రభాస్, రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందో చూడాలి.