ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి నెలలు కావొస్తున్నా.. ఇంకా ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. అయితే ఆర్ఆర్ఆర్ మాత్రం ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేస్తునే ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఈ మూవీ హవా నడుస్తోంది. లాస్ ఏంజిల్స్‌లోని చైనీస్ థియేటర్లో స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత.. ఆడియెన్స్ లేచి నిలబడి చప్పట్లు కొడుతుండగా.. రాజమౌళి స్క్రీన్ ముందుకు వచ్చి అభివాదం చేశాడు. దాంతో అమెరికాకు థ్యాంక్స్ చెబుతూ.. ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు రాజమౌళి. దీనిపై చరణ్ ‘వన్ అండ్ ఓన్లీ రాజమౌళి’ అని స్పందించగా.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అలాగే రెస్పాండ్ అయ్యాడు. ‘ఈ ప్రశంసలు, ఇంకా రానున్న వాటికి నువ్వు అర్హుడివే జక్కన్న’ అంటూ పోస్ట్ చేశాడు.
అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఎన్టీఆర్ 30 అప్టేట్ మాత్రం ఇవ్వడం లేదంటున్నారు అభిమానులు. అది కూడా సెకండాఫ్ దగ్గరే ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఇంకా రిపేర్లు చేస్తునే ఉన్నారా.. అనే సందేహం రాక మానదు. ఆచార్య ఫ్లాప్‌తో కొరటాల, ఎన్టీఆర్ స్క్రిప్టు విషయంలో తగ్గేదేలే అంటున్నారట. అయితే ఇన్ని రోజులుగా చెక్కుతున్నారు కాబట్టి.. ఇక ఫైనల్ స్టేజ్‌కు వచ్చినట్టేనని చెప్పొచ్చు. కానీ మరోసారి సెకండాఫ్ చూడాలని కొరటాలను కోరాడట తారక్. ముఖ్యంగా క్లైమాక్స్ ఇంకొంచెం డెవలప్ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. దాంతో నవంబర్లోనే షూటింగ్ అంటున్నారు. మరి పక్కాగా పవర్ ఫుల్ స్క్రిప్టుతో వస్తున్న ఎన్టీఆర్ 30 ఎలా ఉంటుందో చూడాలి.