NTR 30 : ఆస్కార్ అందుకొని.. ఇండియాకు తిరిగొచ్చేందుకు రెడీ అవుతోంది ట్రిపుల్ ఆర్ టీమ్. వాళ్లకు ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆస్కార్ అందుకొని.. ఇండియాకు తిరిగొచ్చేందుకు రెడీ అవుతోంది ట్రిపుల్ ఆర్ టీమ్. వాళ్లకు ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వచ్చి రాగానే విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా గెస్ట్‌గా రాబోతున్నాడు ఎన్టీఆర్. మార్చి 17న ఈ ఈవెంట్ జరగబోతోంది. ఇక ఆ నెక్స్ట్ డేనే ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఉంటుందని అంటున్నారు. రేపో మాపో దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. అయితే ముహూర్తం జరుపుకున్న తర్వాత.. ఎన్టీఆర్ 30 ఎప్పుడు రెగ్యూలర్ షూటింగ్‌కు వెళ్తుందనే విషయంలో క్లారిటీ లేదు. ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నారని వినిపిస్తోంది. కానీ ఆస్కార్ వేదికగా షూటింగ్ పై క్లారిటీ ఇచ్చేశాడు తారక్. వెరైటీ మ్యాగజైన్‌కి ఇచ్చిన చిన్నపాటి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ 30 షూటింగ్ డేట్ కన్ఫామ్ చేశాడు. సదరు యాంకర్, తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అడగ్గా.. మార్చి 29వ తేదీ నుంచి ఎన్టీఆర్ 30 షూటింగ్లో పాల్గొనబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని.. కొరటాల శివ ఈ సినిమా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. దాంతో ఎన్టీఆర్ 30 షూటింగ్ పై క్లారిటీ వచ్చేసినట్టే. అయితే అప్పుడే కొబ్బరికాయ కొట్టి సెట్స్ పైకి వెళ్తారా.. లేదంటే, ముందే పూజా కార్యక్రమాలు నిర్వహించి, షూటింగ్‌కు వెళ్తారా.. అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే.. ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ రావడంతో.. ఎన్టీఆర్ 30 పై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. మరి ఎన్టీఆర్ 30 ఎలా ఉంటుందో చూడాలి.