కృష్ణా: సుప్రసిద్ధ కవి అందెశ్రీ మృతి తెలుగు సాహిత్య రంగానికి లోటు అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. చదువు లేకపోయినా సహజ కవితనం అబ్బి ”మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు..” లాంటి అజరామరమైన గీతాలను రచించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర గీతం రచించారని తెలిపారు. విజయ భాస్కర్ రచించిన సృష్టికర్త కావ్య ఆవిష్కరణ సభలో ఆయనను కలువగా, తనపై అభిమానం చూపారన్నారు.