NTR30 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 19న విడుదల చేశారు. ఈ మూవీ టైటిల్ ను దేవర (Devara Movie)గా అనౌన్స్ చేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నిర్మాణ సారథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా NTR30. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఈ మూవీలో విలన్‌గా కనిపించనున్నాడు. NTR30 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 19న విడుదల చేశారు. ఈ మూవీ టైటిల్ ను దేవర (Devara Movie)గా అనౌన్స్ చేశారు.
దేవర మూవీ(Devara Movie)కి తమిళ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేశారు. మూడో షెడ్యూల్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్ లో ఈ షెడ్యూల్ మొదలుకానున్నట్లు సమాచారం. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కొరటాల(Koratala Shiva) రంగంలోకి దింపారు.