»Manoj As A Guest At Maunikas First Wedding Photo Viral
Manchu Manoj, Mounika: మౌనిక మొదటి పెళ్లికి గెస్ట్‌గా మనోజ్..ఫొటో వైరల్
మంచు ఫ్యామిలీ(Manchu Family) ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంచు మనోజ్(Manchu Manoj), భూమా మౌనిక(Bhuma Mounika)ల పెళ్లి మార్చి 3న శుక్రవారం రాత్రి జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరుకానున్నారు. గత కొన్ని రోజుల నుంచి మంచు మనోజ్(Manchu Manoj) పెళ్లి గురించి అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా మంచు మనోజ్(Manoj) తన పెళ్లి గురించి అధికారిక ట్విట్టర్లో పోస్టు చేశాడు.

మంచు మనోజ్(Manchu Manoj) వెడ్స్ మౌని అంటూ భూమా మౌనికా రెడ్డి(Bhuma Mounika) ఫొటోను ట్వీట్ చేయడంతో వీళ్లిద్దరి పెళ్లి గురించి అందరికీ క్లారిటీ వచ్చింది. ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంచు మనోజ్, మౌనికలకు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. తాజాగా పెళ్లితో ఒక్కటవుతున్నారు. మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఇంట ఈ పెళ్లి వేడుక జరగనుంది.
మంచు మనోజ్, మౌనికల(Manoj, Mounika) పెళ్లి సందర్భంగా తాజాగా ఓ పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. గతంలో జరిగిన మౌనిక మొదటి పెళ్లికి మనోజ్ గెస్ట్‌గా వెళ్లి ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. మంచు, భూమాల కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్నాయి. అందుకే మౌనిక పెళ్లికి మనోజ్ హాజరయ్యాడు. అయితే కొన్ని మనస్పర్ధల వల్ల మౌనిక(Mounika) తన మొదటి భర్త నుంచి విడిపోయింది.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్(Manchu Manoj) పాత ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోకు నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడు గెస్ట్ గా వెళ్లి ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుంటున్నాడని, డెస్టినీ అంటే ఇదేనని, కొత్త జంటకు శుభాకాంక్షలు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త జంటకు సంబంధించిన పాత ఫొటో(Old Photo) నెట్టింట సందడి చేస్తోంది.