»It Is An Unbearable Pain Rashmikas Sensational Post
Rashmika: భరించలేని నొప్పిగా ఉంది.. రష్మిక సంచలన పోస్ట్
నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ రష్మిక మందన్న.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే.. లేటెస్ట్గా రష్మిక చేసిన ఓ సంచలన పోస్ట్ వైరల్‌గా మారింది.
Rashmika: ప్రస్తుతం రష్మిక మందన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. రీసెంట్గా ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే మరో లేడీ ఓరియేంటేడ్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టింది. శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమా ‘కుబేర’లోను నటిస్తోంది. చివరగా యానిమల్తో సాలిడ్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్ వాంటేడ్ హీరోయిన్గా మారిపోయింది. అయితే.. అప్పుడప్పుడు రష్మిక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అలాగే.. తన వ్యక్తి గత విషయాలను కూడా షేర్ చేస్తు ఉంటుంది. తాజాగా రష్మిక చేసిన పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది. ఆ పోస్ట్ ప్రకారం ప్రజెంట్ ఈ బ్యూటీ నెలసరితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
దీంతో ఇంట్లోనే ఉన్నట్లుగా అర్థమవుతోంది. పీరియడ్ టైంలో వచ్చే కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది రష్మిక. భరించలేని నొప్పిగా ఉందని, బాధ ఎక్కువైందని.. ఇప్పుడేం చేస్తే బెటర్‌గా ఉంటుందంటూ నాలుగు ఆప్షన్స్ అభిమానుల ముందు పెట్టింది. 1. ఐస్‌క్రీమ్స్, చాక్లెట్స్ తినాలా? 2. ఎవరినైనా లాగి ఒక్కటివ్వాలా? 3. మైండ్‌ను డైవర్ట్ చేసేందుకు ఏదైనా సినిమా చూడాలా? 4. అలాగే ఏడుస్తూ కూర్చోవాలా? అని అడిగింది. దీంతో రష్మిక రుతుస్రావంతో ఇబ్బంది పడుతోంది.. పుష్ప 2 షూటింగ్‌కు కూడా దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా.. తన అభిమానులకు ఎలాంటి విషయాన్నైనా చెప్పడానికి రష్మిక వెనకడుగు వేయదని ఈ పోస్ట్‌ని చూస్తే చెప్పొచ్చు.