IT 3rd day raids on Mythri movie makers and sukumar home
IT 3rd day raids:మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri movie makers) ఆఫీసులో వరసగా మూడో రోజు ఐటీ అధికారుల సోదాలు (raids) జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మించేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. సినిమా హిట్ (hit) అవడంతో వచ్చిన లాభంతో ఏం చేశారనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ రోజు అయితే గేటుకు తాళం వేసి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాల పహారాలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇటు దర్శకుడు సుకుమార్ (sukumar) ఇంటిలో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.
నిర్మాణంలో ఉన్న సినిమాల వివరాలు, బడ్జెట్ (budget), రెమ్యునరేషన్ గురించి ఆరా తీస్తున్నారు. త్వరలో ప్రారంభించే మూవీస్, బడ్జెట్ లెక్కలపై ప్రశ్నిస్తున్నారు. ముంబై కేంద్రంగా ఇన్వెస్టర్ల గురించి.. వందల కోట్ల డబ్బు కూడగట్టడం గురించి.. మొత్తంగా పెద్ద పెద్ద సినిమాలకు ఫండ్ (fund) ఎలా అవుతుందని అడుగుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri movie makers) అధినేత నవీన్ ఎర్నెనీకి (naveen) విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయట. అక్కడినుంచి డబ్బులు రావడంపై ఆరా తీస్తున్నారు. అలా డబ్బు వస్తే లెక్కల్లో చూపించాలి. కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీరు పన్ను ఎగవేసినట్టు ఐటీ భావిస్తోంది.
రాజకీయ నేతల ప్రమేయం కూడా ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. వారు పెట్టుబడులు పెట్టారా.? అని అడుగుతున్నట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri movie makers) తీసిన మూవీస్ దాదాపు హిట్టయ్యాయి. దీంతో మంచి వసూళ్లు జరిగాయి. అలా వచ్చిన డబ్బుతో ఏం చేశారు..? హైదరాబాద్ శివారల్లో వందల ఎకరాల భూమి (land) కొనుగోలు చేశారని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఇలా చేసే సమయంలో పన్ను చెల్లించలేదని అంటున్నారు.
పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా డైరెక్టర్‌తో మూవీ ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఆ సినిమా కోసం అడ్వాన్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా చర్చకు వచ్చింది. ఈ వివరాలు కూడా అకౌంట్లలో చూపించలేదు. దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. సినిమాలతో వచ్చిన డబ్బును సుకుమార్ లెక్కల్లో చూపించడం లేదని.. ఎక్కడ దాచిపెట్టారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో సుకుమార్ సినిమా పరంగానే కాకుండా.. వ్యాపార పరంగా కూడా రిలేషన్ కలిగి ఉన్నారని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఓనర్లతో కలిపి బిజినెస్ చేశారాని..? అందుకోసమే ఆయన ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు.