కమల్ హాసన్ (Kamal Haasan) శంకర్ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ ఇండియన్ వివిధ కారణాలతో నిలిచిపోయిన ఈ సినిమా షూట్ ప్రారంభం అయింది. శంకర్ – కమల్ హాసన్ కాంబోలో 1996లో విడుదలైన ‘భారతీయుడు (Bhartiyudu-2)’కు సీక్వెల్‌గా ఈసినిమా సిద్ధమవుతోంది. 2017లో ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించినప్పటికీ 2019లో దీన్ని పట్టాలెక్కించారు. సినిమా చిత్రీకరణ సజావుగా సాగుతోన్న తరుణంలో 2020 ఆరంభంలో సెట్లో క్రేన్ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో షూట్‌ని కొంతకాలం వాయిదా వేశారు. అలా, వాయిదా పడిన ఈ సినిమా కరోనా, చిత్ర నిర్మాణం విషయంలో దర్శకుడు శంకర్(Director Shankar)కు, నిర్మాణ సంస్థకు విబేధాలు తలెత్తడంతో సుమారు రెండేళ్ల నుంచి తిరిగి సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈక్రమంలోనే కమల్ ‘విక్రమ్’ పూర్తి చేసి హిట్ సొంతం చేసుకున్నారు. మరోవైపు శంకర్ సైతం రామ్ చరణ్ (Ram charan) తో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు. త్వరితగతిన ‘ఇండియన్ – 2’ పూర్తి చేయాలని కమల్ హాసన్ – శంకర్ భావించడంతో మూవీ తిరిగి మొదలవుతోంది.
ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని 2024 జనవరికి విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. సరేలే ఇండియన్ 2 సంక్రాంతికి వస్తే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సమ్మర్ కి షిఫ్ట్ అవుతుంది, ఎక్కువ సెలవలు దొరుకుతాయి కాబట్టి మన సినిమాకి మంచి జరుగుతుందనుకున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు ఇండియన్ 2 సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ కి కూడా దాటేసి ఆగస్టు 15కి షిఫ్ట్ అవుతుందని కోలీవుడ్ (Kollywood) ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ మాటలో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియదు కానీ ఇప్పటికైతే ఇండియన్ 2 ఇండిపెండెన్స్ వీక్ ని టార్గెట్ చేస్తుందని సమాచారం. ఇండియన్ 2 రిలీజ్ అయ్యే వరకూ గేమ్ ఛేంజర్ బయటకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. దిల్ రాజు అంతటి ప్రొడ్యూసర్ (Producer)… మన చేతిలో ఏం లేదు అంతా డైరెక్టర్ చేతిలో ఉంది అనే కామెంట్స్ చేస్తున్నాడు. బాహుబలి, KGF, ఆర్ ఆర్ ఆర్ లా పీరియాడిక్ డ్రామాని అయితే శంకర్ తెరకెక్కించట్లేదు. ఇండియన్ 2 ఫక్తు కమర్షియల్ సినిమా… మరి దీనికి ఎందుకు రెండు మూడేళ్ల సమయం పడుతుందో శంకర్ కే తెలియాలని ఫ్యాన్స్ అంటున్నారు