Vijay: మీరే కాబోయే ఓటర్లు, మీరే మంచి లీడర్లను ఎన్నుకోవాలంటూ
తమిళ నటుడు విజయ్ రాజకీయాల గురించి మాట్లాడారు. విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసి.. పాలిటిక్స్ గురించి కామెంట్ చేశారు. దీంతో విజయ్ రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ జరుగుతోంది.
Vijay: తమిళ హీరో దళపతి విజయ్ (Vijay) రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పాలిటిక్స్‌లోకి ఎప్పుడు వస్తారని ఫ్యాన్స్ అడుగుతుంటారు. టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షల్లో టాప్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమంలో హీరో విజయ్ రాజకీయాల గురించి మాట్లాడారు.
మీరే కాబేయే ఓటర్లు, మీరే మంచి లీటర్లను ఎన్నుకోబోతున్నారని విజయ్ (Vijay) అన్నారు. కన్నును చేతితో గుచ్చుకున్నట్టు దేశంలో రాజకీయ పరిస్థితి ఉంది. డబ్బు తీసుకుని ఓట్లు వేయడమే దీనికి ఉదహరణ అని గుర్తుచేశారు. సో డబ్బుకు దూరంగా ఉండాలని.. ఓటు వజ్రాయుధం అని, అమ్ముకోవద్దని సూచించారు. జాగ్రత్తగా ఉండాలని యువతకు పిలుపు నిచ్చారు.
తమిళ నటుల్లో విజయ్‌కు (Vijay) మంచి ఫాలొయింగ్ ఉంది. అతని డ్యాన్స్, నటన ఆకట్టుకుంటాయి. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలొయింగ్ విజయ్‌కే ఉంది. అతనిని దేవునిలా ఆరాధిస్తారు. ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని కోరుతుంటారు. ఇప్పుడు.. ఓ కార్యక్రమంలో విజయ్ (Vijay) రాజకీయాల గురించి ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే విజయ్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. రాజకీయ పార్టీ పెడతారా.? లేదంటే ఏదైనా పార్టీలో చేరతారా..? అంటూ ఫ్యాన్స్ ఒక్కటే చర్చ. విజయ్ రాజకీయాల గురించి మాట్లాడారే కానీ.. పాలిటిక్స్‌లోకి వస్తానని ప్రకటించలేదు.