Navdeep: నేనేంటో ముందు నాకు తెలిస్తే..తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తా
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్లలో హీరో నవదీప్ కూడా ఒకరు. చాలా సందర్భాలలో ఆయన పెళ్లి గురించి మాట్లాడాడు. ఈ మధ్య ఓ కార్యక్రమంలో ఈ హీరో మాట్లాడిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడు వివాహం చేసుకుంటారో క్లారిటీ ఇచ్చేశారు.
Navdeep: గౌతమ్ SSC చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో నవదీప్(Navdeep) తరువాత హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించారు. ఇక ఆయన బిగ్‌బాస్(Big Boss)లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. తాజాగా న్యూసెన్స్(Nuisance) అనే వెబ్‌సిరీస్‌లో కనిపించి మెప్పించాడు. 40 ఏళ్లు దగ్గర పడుతున్నా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ని గడుపుతున్నాడు నవదీప్. ఈ నేపథ్యంలో చాలా సందర్భాలలో ఆయన తన మ్యారెజ్ గురించి మాట్లాడాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవదీప్ మళ్లీ తన పెళ్లిపై స్పందించారు. కేవలం తన గురించి మాత్రమే కాకుండా వివాహ వ్యవస్థ మొత్తంపై కామెంట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.
పెళ్లి( marriage) జరిగే టైమ్‌లో అదే జరుగుతుంది. ప్రస్తుతానికి తాను రెడీగా లేనని..రెడీ అయినప్పుడు చేసుకుంటానని, చేసుకోబోయే అమ్మాయిలకు క్వాలిటీస్ గురించి తాను చెప్పలేనని పేర్కొన్నాడు. ముందు తాను రెడీగా ఉంటే తనకు ఏం కావాలో ఆలోచించుకుంటా..ఆయన తన లోపల ఉన్నవాడికి ఏం కావాలో ఇంకా తెలియదని జోస్యం చెప్పాడు. ముందు తనేంటో తనకు తెలిస్తే కదా అని వెల్లడించాడు. వయస్సు అయిందని, ఎవరో చెప్పారని తొందరపడి పెళ్లి చేసుకోకూడదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మన వివాహ వ్యస్థ చాలా మంచిది. తాను కచ్చితంగా గౌరవిస్తానని అన్నారు. కాకీ దాన్ని అర్థం చేసుకోవడంలో యూత్ ఫెయిల్ అవుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.