‘దేవర’ సినిమాతో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ భారీ విజయం అందుకుంది. తాజాగా జాన్వీపై నటుడు, ఆమె సోదరుడు అర్జున్ కపూర్ ప్రశంసల వర్షం కురిపించారు. జాన్వీ కెరీర్లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతుందని చెప్పారు. ప్రశంసలను, విమర్శలను ఒకేలా తీసుకుంటుందని, ఆమెతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఇక తెలుగులో జాన్వీ తదుపరి సినిమా రామ్ చరణ్‌తో చేయనున్న విషయం తెలిసిందే.