యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మిరాయ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రూ.200 కోట్ల మార్క్ దిశగా వెళ్తోంది. మరోవైపు నార్త్ అమెరికాలో కూడా 2.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో అక్కడ ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత ఈ రికార్డు అందుకున్న హీరోగా తేజ నిలిచారు.