స్టార్ డైరెక్టర్ శంకర్ మరియు అతని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శంకర్ అంటేనే భారీ సినిమాలకు పెట్టింది పేరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి పాన్ ఇండియా కంటెంట్‌తో సినిమాలు చేసిన శంకర్.. ఇప్పుడు రామ్ చరణ్‌తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ జరుపుకుంది ఆర్సీ 15. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి బడ్జెట్ అండ్ రెమ్యూనరేషన్ విషయంలో చర్చ జరుగుతునే ఉంది. అంతేకాదు అప్పుడే నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా పక్కన పడితే.. తాజాగా శంకర్ పారితోషికం గురించి ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న డైరెక్టర్లలో శంకర్ ముందు వరుసలో ఉంటాడు.
అలాంటి శంకర్ ఆర్సీ 15 కోసం జీరో రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. అయితే శంకర్ ఫ్రీగా సినిమా చేస్తున్నాడని కాదు.. పారితోషికానికి బదులు సినిమా లాభాల్లో 50 శాతం వాటా అందుకోబోతున్నాడని తెలుస్తోంది. శంకర్ భారీగా అందుకుంటున్నాడంటే ఓకే.. కానీ సగం వాటా అనేసరికి ఈ వార్తల్లో నిజం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకవేళ ఇదే నిజమైతే శంకర్ భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్తో చరణ్ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవడంతో.. ఆర్సీ 15పై భారీ అంచనాలున్నాయి. పైగా శంకర్ కాబట్టి భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. దాంతో శంకర్ వాటా మరియు పారితోషికం గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. ఇక రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్రా, అంజలి వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.