»Devara Mota Has Started It Will Not Be Normal Anymore
Devara మోత మొదలైంది.. ఇక మామూలుగా ఉండదు!
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలశివ, ఎన్టీఆర్ కాంబో రిపీట్ అవుతుండడంతో.. దేవర పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.
Devara: దేవర సినిమాను కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా దేవర రాబోతోంది. ఇప్పటికే భారీ యాక్షన్స్ సీక్వెన్స్ తెరకెక్కించిన కొరటాల.. యాక్షన్ స్టంట్స్ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్లను కూడా రంగంలోకి దింపాడు. అదిరిపోయే గ్రాఫిక్స్ అండ్ విజువల్స్‌తో దేవర చాలా పవర్ ఫుల్‌గా రాబోతోంది. ఖచ్చితంగా ఈ సినిమా యంగ్ టైగర్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో జనవరి 8న దేవర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు.
దీంతో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. దేవర ప్రపంచం ఎలా ఉండబోతుందోనని గ్లింప్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ 72 సెకండ్ల నిడివితో దేవర గ్లింప్స్ కట్ చేసినట్టుగా సమాచారం. దీంతో 24 గంటల్లో దేవర గ్లింప్స్ దెబ్బకు డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలు కానుందని ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఇక గ్లింప్స్ రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో.. సోషల్ మీడియాలో దేవర మోత మొదలైపోయింది. తాజాగా
మరో మూడు రోజుల్లో.. The Lord of Fear is coming in 3 days #DevaraGlimpse storming from Jan 8th.. అంటూ D షేప్‌లో ఉన్న కత్తిని చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దేవర గ్లింప్స్ బయటికి రావడమే లేట్.. రికార్డులు లేస్తాయ్ అని రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి దేవర గ్లింప్స్ సినిమా పై ఎలాంటి అంచనాలను పెంచుతుందో చూడాలి.