»Manchu Family Entry Of Manchu Familys Third Generation Heir
Manchu Family: మంచు ఫ్యామిలీ మూడో తరం వారసుడి ఎంట్రీ!
నిజమే.. ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ నుంచి రెండు తరాల హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తుండగా.. ఇప్పుడు మూడో తరం వారసుడి తెరంగేట్రం చేయబోతున్నాడు. కన్నప్ప సినిమాతో మంచు ఫ్యామిలీ మూడు తరాలను ఒకే చోట వెండి తెరపై చూడబోతున్నారు.
Manchu Family: గత కొంత కాలంగా మంచు విష్ణు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పాన్ ఇండియా స్థాయిలో ‘కన్నప్ప’ సినిమాను మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మహేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు కన్నప్పగా కనిపించనున్న ఈ సినిమాలో ప్రభాస్ మాహాశివుడిగా, పార్వతి దేవి పాత్రలో నయనతార నటిస్తుందని ముందు నుంచి ప్రచారంలో ఉంది. ప్రభాస్‌తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు భక్త కన్నప్పలో కనపించనున్నారు.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవడంతో.. కన్నడ, మళయాళి నుంచి ఇద్దరు సీనియర్ హీరోలను రంగంలోకి దింపుతున్నాడు మంచు విష్ణు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌తో పాటు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే మోహన్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు కూడా కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. మోహన్ బాబు వారసుడిగా విష్ణు మంచు, మనోజ్ మంచు, లక్ష్మీ మంచు ఇండస్ట్రీలో రాణిస్తుండగా.. ఇప్పుడు విష్ణు మంచు వారసత్వంగా అవ్రామ్ మంచు కన్నప్పతో ఎంట్రీ ఇవ్వనున్నాడు.
విష్ణు మంచు తన ఐదేళ్ల కొడుకు అవ్రామ్ పాత్రకు కన్నప్పలో ఎంతో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు స్పందించారు. ఒక కొత్త శకం ఆవిష్కృతమవుతున్నప్పుడు ఇది ఒక థ్రిల్‌కు మించిన అనుభవం! అవ్రామ్ మంచు ‘కన్నప్ప’తో సినీ విశ్వంలోకి అడుగుపెట్టాడు, మంచు కుటుంబానికి మరో అద్భుతమైన అధ్యాయాన్ని జోడించి, తరతరాలను ముందుకు తీసుకువెళతాడు.. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, ఇది మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం.. అంటూ చెప్పుకొచ్చారు.