తమిళ స్టార్ ధనుష్‌తో నటి శ్రుతి హాసన్ మరోసారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ‘అమరన్’ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామితో ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో శ్రుతి కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ధనుష్, శ్రుతి కాంబోలో గతంలో ‘3’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.