ప్రస్తుతం బాలీవుడ్ బాయ్ కాట్ ట్రెండ్‌తో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో విజువల్ వండర్‌గా భారీ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది బ్రహ్మాస్త్ర పార్ట్ వన్. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. కరణ్ జోహార్ నిర్మాణంలో.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా.. ఈ వారం భారీ స్థాయిలో రిలీజ్ అయింది బ్రహ్మాస్త్ర. తెలుగులో రాజమౌళి సమర్పణలో వచ్చిన ఈ సినిమాలో కింగ్ నాగార్జున్ కీలక పాత్రలో నటించాడు. దాంతో బ్రహ్మాస్త్ర ఓపెనింగ్స్ పైనే అందరి చూపు ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తోంది.
వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు 75 కోట్ల భారీ గ్రాస్ రాబట్టినట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ఆడియెన్స్‌కు థ్యాంక్స్ కూడా చెప్పారు. దాంతో ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచిందని చెప్పొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లోను భారీ వసూళ్లు అందుకున్నట్టు ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా బ్రహ్మాస్త్ర ఈ వీకెండ్ వరకు భారీ కలెక్షన్లను రాబట్టనుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. కొందరు బాలీవుడ్ స్టార్స్ బ్రహ్మాస్త్రపై విరుచుకు పడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిందని చెబుతోందట. అంతేకాదు నష్టాలతో సహా లెక్కలు చూపించి మరి నెగెటివ్ కామెంట్స్ చేస్తోందట. కానీ ఓ మోస్తారు మిక్స్డ్ టాక్‌తో బ్రహ్మాస్త్ర గట్టేక్కేలానే ఉందంటున్నారు.