»Bheemadevarapally Branch Movie Release On June 23 Under Mythri Movies
Bheemadevarapally branch: మైత్రి మూవీస్ ఆధ్వర్యంలో జూన్ 23న రిలీజ్
తెలంగాణ నేపథ్యంలో మరో చిత్రం రాబోతుంది. అదే భీమదేవరపల్లి బ్రాంచి(Bheemadevarapally branch) మూవీ. అయితే ఈ చిత్రాన్ని ఇప్పటికే పలు ప్రివ్యూ షోలు చూసిన సినీ ప్రముఖులు, ఐదుగురు మినిస్టర్స్, ముగ్గురు ఎంపీలు ఈ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని చూసిన మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి(Bheemadevarapally branch). ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. రమేష్ చెప్పాల రచన-దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, సీనియర్ నేత అద్దంకి దయాకర్ నటించడంతో ఈ చిత్రంలో ఆసక్తి రేకిస్తోంది.
“భీమదేవరపల్లి బ్రాంచి” ఒక ఆర్గానిక్ గ్రామీణ చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్ ఆధారంగా ఈ సినిమాను”నియో రియలిజం” జానర్లో చిత్రీకరించారు. ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం”భీమదేవరపల్లి బ్రాంచి” కావడం విశేషం. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా థియేటర్ & ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని, చాలా రియాలిటీగా తెరకెక్కించారు. కంటెంట్ ఓరియంటెడ్ స్పెషల్ మూవీ భీమదేవరపల్లి బ్రాంచి మూవీ కాగా.. రెండు గంటలు పల్లె వాతావరణం కళ్ళ ముందు కదలాడుతుంది. ప్రతి ఒక్కరిని తమ గ్రామానికి తీసుకెళ్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాటలు, ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద ఆసక్తి రేకెత్తించగా ఈ సినిమా కంటెంట్ నచ్చి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.