విజయ్ దేవరకొండతో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి వచ్చి ఐదేళ్లు దాటిపోయింది.. అయినా ఇప్పటికీ ఈ సినిమా ఓ సంచలనం. అయితే అర్జున్ రెడ్డి తర్వాత ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మరో సినిమా రాలేదు. అర్జున్ రెడ్డి మూవీనే హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు.
అక్కడా కూడా ఈ సినిమా అదరగొట్టింది. ఇలా సందీప్ రెడ్డి నుంచి ఒక్క సినిమానే వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే సినిమా కమిట్ అయ్యాడు సందీప్. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రభాస్.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాలతో బిజీగా ఉన్నాడు. సందీప్ కూడా రణ్ బీర్ సింగ్ హీరోగా ‘యానిమల్’ అనే బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌తోనే అందరినీ అట్రాక్ట్ చేశాడు సందీప్.
ఇక ఇప్పుడు ‘యానిమల్’ లీక్డ్ లుక్ చూసి.. సందీప్ మరో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అంటున్నారు. తాజాగా రణబీర్ ఆన్ లొకేషన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చాక్లెట్ బాయ్ లుక్ చూసి.. ‘యానిమల్’ అంతకు మించి అనేలా.. వైలెంట్‌గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.
ఒంటిపై రక్తం.. గుబురు గడ్డంతో.. చాలా రఫ్‌గా.. వయొలెంట్‌గా కనిపిస్తున్నాడు రణ్‌బీర్. దాంతో ఈ చిత్రం పై బాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఊహించని లుక్‌లో రణబీర్ కనిపిస్తుండడంతో.. మరోసారి అర్జున్ రెడ్డి డైరెక్టర్ దుమ్ము లేపడం పక్కా అంటున్నారు. మరి యానిమల్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.