టాలీవుడ్(Tollywood)లో కుర్ర హీరోయిన్ల హవా ఎక్కువగా నడుస్తోంది. ఇప్పుడంతా ఓ ముగ్గురు నలుగురు కొత్త హీరోయిన్లు వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) కాస్త కొత్తగా ట్రై చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ ముద్దుగుమ్మ కాస్త రెగ్యులర్ పాత్రలు కాకుండా కంటెంట్ ఉండే కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇందులో కొన్ని సినిమాలు హిట్(HIT) అయ్యాయి. మరికొన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకునే క్రమంలో అనుమప(Anupama) స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలను కూడా మిస్సయ్యింది. ఇప్పుడు ఈ హీరోయిన్ సోలో హీరోయిన్ ఇమేజ్ వచ్చే సినిమాల వైపు మొగ్గుచూపుతోంది. నయనతార(Nayanatara), అనుష్క(Anuska), సమంత(Samantha) ఆ రకం సినిమాలు చేసి విజయవంతమయ్యారు. నయనతార అయితే ఏడాదికి ఒక్క హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సమంత(Samantha) కూడా ‘యశోద’తో ఇరగదీసింది. ఇప్పుడు ‘శాకుంతలం’ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
స్టార్ హీరోయిన్లు అయిన నయనతార, అనుష్క, సమంతతో ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) పోటీ పడాలనుకుంటోంది. వారిలాగే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘బట్టర్ ఫ్లై’ అనే మూవీని అనుపమ పరమేశ్వరన్ చేసింది. ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వకపోవడంతో ఈ కుర్ర హీరోయిన్ కు మైనస్ అయ్యిందనే చెప్పొచ్చు. తాజాగా ఇప్పుడు మరో కొత్త కథకు అనేపమ(Anupama) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
లైకా ప్రొడక్షన్స్(Lyka Productions) లాంటి పెద్ద బ్యానర్ లో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ఓ సినిమా చేయబోతోంది. ఈ సినిమా 2 రోజుల్లో లాంచ్ కానుంది. ఈ మూవీ కానీ క్లిక్ అయితే భవిష్యత్తులో మరిన్ని ఫిమేల్ లీడ్ మూవీస్ చేసేందుకు అనుపమ పరమేశ్వరన్ గట్టి నిర్ణయం తీసుకోనుంది. దీంతో నయనతార, అనుష్క, సమంతలకు పోటీగా తాను కూడా ఇండస్ట్రీలో నిలబడి చూపించేందుకు సిద్దమయ్యింది. త్వరలోనే మరిన్ని ఫీమేల్ లీడ్ సినిమాలు అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) నుంచి ప్రేక్షకులు చూడబోతున్నారు.