విజయ్ దేవరకొండ లైగర్ సినిమా బెడిసికొట్టింది. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటే.. తీరా అది కాస్త బెడసి కొట్టడంతో.. రౌడీ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అలాంటి సమయంలో వాళ్లను అనవసరంగా కెలికింది యాంకర్ అనసూయ. ఇక అంతే.. వారు ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
అనడమే కాదు.. ఇప్పుడు ఆంటీని ట్రెండ్ చేసేశారు. దేశ వ్యాప్తంగా ఆంటీ పదం ట్రెండ్ అవుతోంది. వాళ్లు చేస్తున్న కామెంట్లకు అనసూయ కూడా ధీటుగానే సమాధానం చెబుతుండటం గమనార్హం.
కాగా… లైగర్ సినిమా కి టాక్ జస్ట్ డివైడ్ గా వచ్చింది అంతే దెబ్బకి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ ఆ సినిమాపై పడ్డాయి. నిజానికి అనసూయ ట్వీట్ చేయకుంటే.. సినిమాని ట్రోల్ చేసేవాళ్లు చాలా మందే పెరిగేవారు. కానీ.. అందరిలానే అనసూయ కూడా విజయ్ పై అప్పుడు అర్జున్ రెడ్డి కాంట్రవర్సీ ని గుర్తు చేస్తూ సంచలన పోస్ట్ పెట్టింది. దీనితో అక్కడ నుంచి ఆ టాపిక్ సినిమా నుంచి డైవర్ట్ అయ్యి.. ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఇప్పటీకీ కూడా ఇదే అంశం పెద్ద ఎత్తున వైరల్ గా వినిపిస్తూ వస్తుంది. దీనితో అయితే ఇక అంతా లైగర్ నెగిటివ్ టాక్ అంతా పక్కకి వెళ్ళిపోయి అంతా అనసూయ – ఆంటీ ట్యాగ్ లపై పడ్డారు. ఆ రకంగా అయితే అనసూయ వల్ల సోషల్ మీడియాలో లైగర్ కి భారీ ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.