Directorపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్.. గీత దాటారంటూ
కొందరు దర్శకులు గీత దాటుతారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హాట్ కామెంట్స్ ఇచ్చారు. మాట ఇచ్చి తప్పుతారని అన్నారు. దర్శకుడు పరశురామ్ గురించి అల్లు అరవింద్ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.
Allu Aravind: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) హాట్ కామెంట్స్ చేశారు. 2018 ఈవెంట్‌కు వచ్చిన అరవింద్ (Aravind) కొందరు డైరెక్టర్లు లక్ష్యంగా మాట్లాడారు. కొందరు కమిట్ అయితే మాట తప్పరని.. తమతోనే ఉంటారని, మరికొందరు మాత్రం స్వార్థం చూసుకుంటారని తెలిపారు. ఆయన కామెంట్ చేసింది డైరెక్టర్ పరశురామ్ గురించి అని తెలిసింది..
చదవండి: Mohan Babu: వంద కోట్ల సినిమా ప్రకటించిన మోహన్‌బాబు
2018 కార్యక్రమానికి రాగానే చందూ మొండేటి (chandu mondeto), బన్నీ వాసుతో (bunny vasu) కలిసి ఫొటో దిగానని చెప్పారు. కార్తికేయ 2 (kaarthikeya-2) కన్నా ముందే చందూ తనతో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడని వివరించారు. దీంతో అతనికి ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదని చెప్పారు. చందూ (chandu) గొప్ప డైరెక్టర్ అవుతాడని భావించి రెండు సినిమాలకు బుక్ చేసుకున్నానని వివరించారు. అతనికి టెంప్టింగ్ ఆఫర్స్ ఇచ్చినా తనతోనే ఉన్నాడని గుర్తుచేశారు.
తన ద్వారా పైకి వచ్చిన కొందరు దర్శకులు (directors) మాత్రం అలా లేరని చెప్పారు. గీత దాటి వెళ్లి పనిచేసుకున్నారని వివరించారు. చందూ (chandu) మాత్రం నిలబడిపోయారని చెప్పారు. పరశురాం (Parasuram), విజయ్ దేవరకొండతో (vijay) అల్లు అరవింద్ (allu aravind) సినిమా ప్లాన్ చేశారు. పరశురాం అరవింద్‌ను కాదని దిల్ రాజుతో (dil raju) సినిమా చేస్తున్నాడు. దీనిని ఉద్దేశించి అరవింద్ (aravind) కామెంట్ చేశారు. నిజమే మరీ.. అవకాశం ఇచ్చి, నిలబడేందుకు కారణమైన అరవింద్‌ను (aravind) కాదని మరొకరితో మూవీ చేయడం తప్పేనని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు. మరికొందరు మాత్రం ఆఫర్ వస్తే వెళతారు.. తప్పేముందని కవర్ చేస్తున్నారు.