»Actress Simran Choudhary Attracts With Her Latest Photoshoot
Simran Choudhary: టెంప్టింగ్ ఫోజులతో ట్రెండ్ సెట్ చేస్తున్న విశ్వక్ సేన్ హీరోయిన్
ఇప్పటి వరకు ‘భోంబాట్’,‘చెక్’, ‘పాగల్’ ‘సెహరి’ వంటి మొత్తం ఆరు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ చౌదరికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమానే గుర్తింపు తెచ్చిపెట్టింది. మళ్లీ అలాంటి హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
Simran Choudhary: విశ్వక్ సేస్ సరసన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో కుర్రాళ్ల గుండెళ్లను పేల్చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న స్టన్నింగ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది?’ యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హీరోయిన్ గా సిమ్రాన్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా రీరిలీజ్ కూడా అయింది.
ఆ సినిమాలో నటన, అందంతో అలరించింది. హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ చిత్రం తర్వాత వరుస సినిమాల్లో నటించింది. కానీ దురదృష్టవశాత్తు పెద్ద హిట్ దక్కించుకోలేదు. ఇప్పటి వరకు ‘భోంబాట్’,‘చెక్’, ‘పాగల్’ ‘సెహరి’ వంటి మొత్తం ఆరు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ చౌదరికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమానే గుర్తింపు తెచ్చిపెట్టింది. మళ్లీ అలాంటి హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో అవకాశాల వేటలో ఉంది. సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుసగా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ దర్శకనిర్మాతల కంట్లో పడాలని చూస్తోంది. నయా లుక్స్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం అమ్మడు ‘అథర్వ’ అనే చిత్రంలో నటిస్తున్న తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా విషయాలు తెలియాల్సి ఉంది.