ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై మలయాళ హీరో మోహన్ లాల్ స్పందించారు. ఈ అవార్డుకు ఎంపికయ్యారంటూ PMO నుంచి కాల్ వస్తే నమ్మలేకపోయానని, కలలో ఉన్నానేమో అనుకుని మరోసారి చెప్పమని అడిగినట్లు తెలిపారు. ఇది మలయాళ సినిమాకు వచ్చిన అవార్డు అని, నిజాయితీగా పని చేయడంతో పాటు భగవంతుని ఆశీస్సుల వల్ల ఈ అవార్డు వచ్చిందన్నారు. సినిమా తప్ప తనకు పెద్ద డ్రీమ్స్ లేవని తెలిపారు.