»A Famous Hero Who Has Been Playing The Same Drawer For Ten Years
Celebrity Drawer : ఛీ…ఛీ.. ఆ హీరో పదేళ్లుగా ఒకే డ్రాయర్ వాడుతున్నాడట
ప్రతి మనిషికి కొన్ని సెంటిమెంట్లు(Sentiment) ఉండడం సహజం. కొంతమందికి సెంటిమెంట్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ సెంటిమెంట్లతో వారు ఇబ్బంది పడుతూ..తన పక్కన ఉన్న వారిని కూడా ఇబ్బందుల పాలు చేస్తుంటారు. ఇలా కొంతమంది సెంటిమెంట్లే వారికి పిచ్చిగా మారుతుంది.
Celebrity Drawer : ప్రతి మనిషికి కొన్ని సెంటిమెంట్లు(Sentiment) ఉండడం సహజం. కొంతమందికి సెంటిమెంట్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ సెంటిమెంట్లతో వారు ఇబ్బంది పడుతూ..తన పక్కన ఉన్న వారిని కూడా ఇబ్బందుల పాలు చేస్తుంటారు. ఇలా కొంతమంది సెంటిమెంట్లే వారికి పిచ్చిగా మారుతుంది. ఈ రకం వాళ్లు దేన్నేనా సెంటిమెంటుగా అనుకుంటే దాన్ని వదిలిపెట్టరు. అచ్చి వచ్చాయని బైకు(Bike)నో, సైకిలో(Cycle), పెన్ను(Pen) ఇలా చాలా ఉంటాయి. అవి చాలా పాతగా మారినా వాటిని అమ్మరు.. పాడేయరు. ఆఖరికి వేసుకునే బట్టల(Cloths) విషయంలో కూడా చాలా నిక్కచ్చిగా ఉంటారు. అందులో సాధారణ ప్రజలు.. సెలెబ్రిటీ(Celebrity)లకు తేడా ఏం ఉండదు.
సెంటిమెంట్ల విషయానికి వస్తే అందరూ సమానులే. జపాన్(Japan) దేశానికి చెందిన నటుడు యూకీ కాజీ(Yuki Kaji) కూడా అంతే.. ఆయనకు ఓ డ్రాయర్(Underwear) సెంటిమెంట్ అంట. దీంతో అది చిరిగిపోయినా దాన్నే దాదాపు పదేళ్ల(10Years) పాటు వేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. యూకీ కాజీ తన పోస్టులో..‘‘ నేను అటాక్ ఆన్ టైటాన్స్(attack on titans)కు ఓ పాత్ర చేస్తూ ఉన్నాను. కొన్ని కారణాల వల్ల ఒకే డ్రాయర్ వేసుకోవాల్సి వచ్చేది. అది కేవలం యాధృచ్చికమని నేను అనుకుంటున్నాను. నేను మొదటి ఎపిసోడ్ రికార్డు చేస్తున్నపుడు బ్లాక్ అండ్ వైట్ డ్రాయర్ వేసుకున్నాను. అది నా పనిని తెలిపే విధంగా ఉంటుందని అనుకున్నాను.రెండవ ఎపిసోడ్కు కూడా అదే డ్రాయర్ వేసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది. ‘అయ్యో.. గత వారమే కదా దాన్ని వేసుకున్నాను’అని. అప్పుడు నిశ్చయించుకున్నాము. దాన్నే ప్రతి ఎపిసోడ్(Episode)కు ధరించాలని. అలా పదేళ్ల నుంచి వాడుతున్నాను. ఇప్పుడు ఒక ఎపిసోడ్ మాత్రమే ఉంది. త్వరలో రిటైర్ అయిపోతా’’ అని చెప్పాడు.