ఫేక్ రివ్యూలపై తమిళ హీరో ధనుష్ అసహనం వ్యక్తం చేశారు. ‘థియేటర్లలో షో పడకముందే.. రివ్యూలు వచ్చేస్తున్నాయి. ఆ ఫేక్ రివ్యూలను నమ్మకండి. సినిమాని మీరు చూశాకే బాగుందో.. లేదో చెప్పండి. లేదా మీ స్నేహితుల్లో ఎవరైనా ఉంటే వారిని అడగండి. అంతే తప్ప సినిమా చూడకుండా రివ్యూలు చెప్పేవారిని నమ్మకండి’ అని రిక్వెస్ట్ చేశారు.