ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి మెరుపు అర్ధశతకం సాధించగా, గిల్(47), తిలక్(30) రాణించారు. ఈ టోర్నమెంట్లో పాక్పై భారత్కు ఇది రెండో విజయం.