తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ జనవరి 10న రిలీజ్ కాబోతుంది. అయితే తెలుగులో కూడా విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి మూవీల రద్దీ, థియేటర్ల లభ్యత తక్కువ ఉన్న కారణంగా జనవరి 23న ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఇక 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది.