AP: పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా స్పెషల్ షోతో పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతినిస్తూ GO జారీ చేసింది. ఈనెల 25న తెల్లవారుజామున 1 గంటకు ప్రత్యేక షోకు అనుమతి ఇస్తూ.. టికెట్ ధరను రూ.1,000గా నిర్ణయించింది. అలాగే, 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.125 , మల్టీప్లెక్స్‌లలో రూ.150 వరకు ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.