మెల్బోర్న్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన హెడ్(409)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. అతడి బంతిని అంచనా వేయడంలో విఫలమైన హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 4వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్మిత్, మిచెల్ మార్ష్ క్రీజులో ఉన్నారు.