మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ‘మీ టూ’ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు డైరెక్టర్ రంజిత్ బాలకృష్ణన్‌పై కేసు నమోదైంది. కాగా, ఆయనపై ఫిర్యాదు చేసింది మాత్రం ఓ నటుడు. ‘2012లో బెంగళూరులోని ఓ హోటల్‌కు రంజిత్ నన్ను పిలిచాడు. ఆడిషన్ పేరిట నా దుస్తులు తొలగించమని లైంగికంగా వేధించాడు’ అని ఆ నటుడు ఫిర్యాదు చేశాడు. కాగా, రంజిత్ పై ఇప్పటికే ఓ నటి కొచ్చిలో లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసినట్లు సమాచారం.